కామన్వెల్త్‌కు పోరుకు కొండవెలగాడ కుర్రాడు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:58 AM
నెల్లిమ ర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెం దిన యువ వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు అరుదైన ఘనత సాధించాడు.
నెల్లిమర్ల, జూలై 24(ఆంధ్రజ్యోతి): నెల్లిమ ర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెం దిన యువ వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు అరుదైన ఘనత సాధించాడు. అంత ర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న అజయ్‌బాబు ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపిక య్యా డు. భారత్ తరపున 79 కేజీల విభా గంలో అజయ్‌బాబు బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 27న గ్లాస్కో వేదికగా జరుగుతున్న ఈ పోటీ ల్లో పాల్గొంటాడు. అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010లో కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించి.. ప్రస్తుతం నేషనల్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. తండ్రి స్ఫూర్తితో ఎనిమిదేళ్ల వయసు నుంచే శిక్షణ తీసు కుంటున్న అజయ్ కఠోర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను అందుకున్నాడు. చిన్న గ్రామం నెల్లిమర్ల మండలం కొండవెలగాడ నుంచి ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ వేదికపై భారత్ తరపున సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు.