Death మరణంలోనూ వీడని బంధం
ABN , Publish Date - May 23 , 2026 | 12:31 AM
A Bond That Didn’t End Even in Death మరణంలోనూ వారి బంధం వీడలేదు. తల్లీకొడుకు అనారోగ్య సమస్యలతో ఒకేసారి మృతిచెందారు. వారికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానికులే అంత్యక్రియలు పూర్తిచేశారు.
అంత్యక్రియలు పూర్తి చేసిన స్థానికులు
వీరఘట్టం, మే22(ఆంధ్రజ్యోతి): మరణంలోనూ వారి బంధం వీడలేదు. తల్లీకొడుకు అనారోగ్య సమస్యలతో ఒకేసారి మృతిచెందారు. వారికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానికులే అంత్యక్రియలు పూర్తిచేశారు. వివరాల్లోకి వెళ్తే.. తల్లి, కొడుకులైన సీరాపు పార్వతమ్మ (80), మజ్జీశ్వరరావు (55) కొన్నాళ్లుగా వీరఘట్టంలోని బీసీ కాలనీలోని ఓ చిన్న అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. పింఛన్ల ఆధారంగానే జీవనం సాగిస్తున్నారు. మానసిక దివ్యాంగుడైన మజ్జీశ్వరరావు తల్లి ఆలనాపాలనా చూసుకునేవాడు. అయితే గత మూడు రోజులుగా వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పార్వతమ్మ పూర్తిగా మంచానికే పరిమితమవడంతో రెండు రోజుల నుంచి వారిద్దరూ బయటకు రాలేదు. ఈ క్రమంలోనే వారు గురువారం రాత్రి సమయంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం ఉదయం స్థానికులు వెళ్లి చూడగా.. వారు మరణించినట్లు గుర్తించారు. దీంతో కాలనీవాసులు తలో చేయి వేసి వారికి అంత్యక్రియలు పూర్తి చేశారు.