Share News

మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - May 19 , 2026 | 12:07 AM

మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట
ఎగ్‌ కార్ట్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

మక్కువ రూరల్‌ (సాలూరు) మే 18 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ఎగ్‌ కార్ట్స్‌ను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం నాలుగు సంఘాలకు రూ.2 లక్షల విలువైన నాలుగు ఎగ్‌ కార్ట్స్‌ను పంపిణీ చేసిందన్నారు. ప్రతి యూనిట్‌కు గ్యాస్‌ స్టౌ, సిలిండర్‌ కూడా అందజేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఇస్తు న్న ఆర్థిక ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో మోప్మా, మున్సిపల్‌ అధి కారులతో పాటు సాలూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:07 AM