అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:13 AM
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.
తెర్లాం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి మంజూరైన రూ.4.95 కోట్లతో రోడ్ల పనులకు ఆయన మంగళవారం బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడుతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాలను పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారన్నారు. అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను గమనించి ప్రధాన రహదారులను యుద్ధప్రాతిపదికన బాగు చేయిం చామన్నారు. ఇప్పుడు రూ.3.05 కోట్లతో పనుకువలస- బలిజపేట రోడ్డు, రూ.కోటితో సుందరాడ- గళావలి రోడ్డు, రూ.90 లక్షలతో సుందరాడ- రామినాయుడువలస రోడ్డు పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకట నాయుడు, టీడీపీ సీనియర్ నేత అల్లాడ భాస్కరరావు, బీజేపీ జిల్లా ప్రఽధాన కార్యదర్శి వేమకోటి గిరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేశ్, మర్రాపు యుగంధర్, రెడ్డి శంకరరావు తదితరులు