Share News

రైతు సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:12 AM

కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం కురుపాంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట
కురుపాం: రైతులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెలే జగదీశ్వరి, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు :

కురుపాం,జూన్‌20(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం కురుపాంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జగదీశ్వరి రైతులకు 26 కోట్ల 82 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ కడ్రక కళావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ, అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, రాష్ట్ర ట్రైకర్‌ బోర్డు సభ్యురాలు, పువ్వల లావణ్య పాల్గొన్నారు.

సకాలంలో నీరందించేలా చర్యలు

గుమ్మలక్ష్మీపురం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాగునీరు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. బొద్దిడి నుంచి గుణద వరకు ఉన్న పంట కాలువకు సంబంధించి సిల్ట్‌ క్లియరెన్స్‌, జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ప్రారభించారు. కాగా గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన రెవె న్యూ డే కార్యక్రమంలో తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర అభి వృద్ధిలోనూ, ప్రజలకు పారదర్శకమైన సవలు అందించడంలోనూ రెవె న్యూశాఖ కీలకపాత్ర పోషిస్తోందన్నారు.

పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించా లని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. మం డలంలోని పెద్దఖర్జలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద కార్యక్రమంలో భాగంగా వీధులు, పరిసర ప్రాంతాలను అధికారులు, గ్రామస్థులతో కలిసి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు బిడ్డిక పద్మావతి, బొంగు సురేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:12 AM