Conquered Death మృత్యుంజయురాలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:05 AM
A baby Who Conquered Death పాలకొండలోని చిన్న బల్లంకివీధిలో ఓ మూడేళ్ల పాప ఆడుకుంటూ నీరులేని బావిలో పడింది. సుమారు 15 అడుగుల లోతు కింద పడినా ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది.
సురక్షితంగా బయటకు తీసిన ఫైర్ సిబ్బంది
పాలకొండ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): పాలకొండలోని చిన్న బల్లంకివీధిలో ఓ మూడేళ్ల పాప ఆడుకుంటూ నీరులేని బావిలో పడింది. సుమారు 15 అడుగుల లోతు కింద పడినా ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. వివవరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని బల్లంకి వీధిలో ఉంటున్న పట్నాన శ్రీనివాసరావు చిరు వ్యాపారిగా జీవనం సాగిస్తున్నారు. గురువారం ఆయన ఇంటికి విశాఖ నుంచి కూతురు, అల్లుడు తేజేశ్వరి, గణేష్‌తో పాటు మూడేళ్ల మనవరాలు లహరి వచ్చారు. కాగా శుక్రవారం ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటున్న లహరి.. ఉన్నట్టుండి ఆ ప్రాంగణంలోనే ఉన్న నీరు లేని బావిలో పడిపోయింది. బావిపై ఉన్న చెక్కపైకి వెళ్లి.. పట్టు తప్పి 15 అడుగుల కింద పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత పాప కోసం వెతికిన కుటుంబ సభ్యులు బావిలో పాప ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సురక్షితంగా పాపను బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆనందంతో పాపను ఎత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. సహాయక చర్యలు చేపట్టి పాపను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది సేవలను పలువురు ప్రశంసించారు.