9,600 పాస్ పుస్తకాలు సిద్ధం: తహసీల్దార్
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:56 PM
ఇప్పటి వరకూ 9,600 పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయని, వీటిని ఈనెల తొమ్మిదో తేదీ వరకూ ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పంపిణీ చేస్తామని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు.
బొబ్బిలి రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ 9,600 పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయని, వీటిని ఈనెల తొమ్మిదో తేదీ వరకూ ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పంపిణీ చేస్తామని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. ఆదివారం మండలంలోని కృష్ణాపురం, పిరిడి, శివడవలస, కమ్మవలస, వాకాడవలస తదితర గ్రామాల్లో రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాల్లో తప్పులు ఉంటే సరిది ద్దుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. వెబ్‌ల్యాం డ్‌లో వివరాల ప్రకారమే ఎటువంటి తప్పులు లేకుండా, రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో మాత్రమే పాస్ పుస్తకాల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్ర మంలో ఆర్‌ఎస్‌డీటీ శివున్నాయుడు, ఈడీటీ గైరి శంకరరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.