Share News

90శాతం సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:20 AM

కార్యకర్తే అధినేత పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇప్పటివరకు వచ్చి న ఫిర్యాదుల్లో 90శాతం పరిష్కరించామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు.

90శాతం సమస్యల పరిష్కారం

రాజాం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కార్యకర్తే అధినేత పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇప్పటివరకు వచ్చి న ఫిర్యాదుల్లో 90శాతం పరిష్కరించామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. శనివారం రాజాం లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన కార్య కర్తే అధినేత కార్యక్రమం నిర్వహించి.. 25 ఫిర్యాదులు స్వీక రించారు. అనంతరం రూ.50వేలు విలువగల ఎగ్‌కా ర్టులను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు.

పశువుల ఆరోగ్యంతో రైతుల అభివృద్ధి

వంగర , ఏప్రిల్‌ 4(ఆంద్రజ్యోతి): పశువుల ఆరోగ్యం.. రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. అరసాడ గ్రామంలో శనివా రం ఏర్పాటుచేసిన పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారం భించారు. అనంతరం వైద్యులు పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు బొత్స వాసు దేవరావునాయుడు, ఎల్‌.కృష్టమూర్తి పాల్గొన్నారు.

26న శ్రీనివాస కల్యాణం

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 4(ఆంరఽధజ్యోతి): శ్యాం పురం అగ్రహారంలో ఈనెల 26న నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవానికి పెద్దఎత్తున భక్తులు రావాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ పిలుపుని చ్చారు. గాయత్రీ బ్రాహ్మణ సంఘం, శ్యాంపురం అగ్రహారం నిర్వహించే ఈ కల్యాణానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన శనివారం ఆవిష్కరిం చారు. సంఘ ప్రతినిధులు రంప జగదీశ్వరశర్మ, కేవీఎ స్‌కేజీ శర్మ తదితరులంతా ఎమ్మెల్యేకు ఆహ్వానపత్రిక అందజేశారు.

రాములోరి సంబరాల్లో ఎమ్మెల్యే

రేగిడి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కాగితపల్లి గ్రామంలో ని దుబ కుటుంబీకులు నిర్వహిస్తున్న రాములోరి సంబరాల్లో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ శనివారం పాల్గొన్నారు. పూజలు నిర్వహించి, అనంతరం పందిర పాటను తిలకించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:20 AM