టీడీపీలో 85 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:25 AM
డంగభద్ర గ్రామానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి.
గుమ్మలక్ష్మీ పురం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): డంగభద్ర గ్రామానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. అలాగే డోలుకోన గ్రామానికి చెందిన 20 కుటుంబాలు, కీసరగూడ గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీలో సముచిత స్థానం ఉంటుం దన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, కురుపాం ఏఎంసీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, మండల కన్వీనర్ జోగి భుజంగరావు తదతరులు పాల్గొన్నారు.