Share News

8 వేల పార్టీ సభ్యత్వాల నమోదు’

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:28 AM

నియోజకవర్గంలో ఇప్పటివరకూ 8 వేల పార్టీ సభ్యత్వాలను స్వీకరించామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.

8 వేల పార్టీ సభ్యత్వాల నమోదు’
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయకృష్ణ

‘పాలకొండ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఇప్పటివరకూ 8 వేల పార్టీ సభ్యత్వాలను స్వీకరించామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనసేన సభ్యత్వ నమోదు రాష్ట్రం అంతటా పండుగలా జరుగుతోందన్నారు. కార్య క్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. రూ.400తో సభ్యత్వం పొందితే రానున్న రోజుల్లో పార్టీ నుంచి చేపట్టబోయే కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు కార్యకర్తల కుటుంబానికి భరోసా ఉంటుందన్నారు. పాలకొండ నియోజకవర్గంలో సుమారుగా రూ.35 లక్షలను జనసేన కార్యకర్తల కుటుంబాలకు అందిం చామన్నారు. మార్చి 17 వరకు జరిగే జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్య క్రమంలో అందరూ నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ తోయక సంధ్యారాణి, కూటమి నాయకులు గర్భాన సత్తిబాబు, కర్నేన అప్పలనాయుడు తదితరులున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:28 AM