Share News

79 పంచదార ప్యాకెట్లు సీజ్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:26 AM

మండలంలోని నిడగల్లు గ్రామంలో సివిల్‌ సప్లైస్‌, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం 606 కేజీలు, పంచదార 79 ప్యాకెట్లు(39.50కిలోలు) స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

79 పంచదార ప్యాకెట్లు సీజ్‌
అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, పంచదారను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ ప్రసన్న కుమార్‌ :

సీతానగరం, సెప్టెంబరు5(ఆంధ్రజ్యోతి): మండలంలోని నిడగల్లు గ్రామంలో సివిల్‌ సప్లైస్‌, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం 606 కేజీలు, పంచదార 79 ప్యాకెట్లు(39.50కిలోలు) స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఈ మేరకు 6ఏ కేసు నమోదు చేశారు. అక్రమంగా రేషన్‌ సరుకుల నిల్వ చేసినా, తరలించినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ ప్రసన్న కుమార్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి డి.అశోక్‌, ఆర్‌ఐ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:26 AM