Share News

పీజీఆర్‌ఎస్‌లో 74,521 అర్జీలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:50 PM

గత రెండు సంవత్సరాల ఐదు నెలల్లో పీజీఆర్‌ ఎస్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా 74,521 అర్జీలు అందా యని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌లో 74,521 అర్జీలు

  • రెవెన్యూ, సర్వే శాఖవే 47వేలు

  • పరిష్కారానికి ఎస్‌వోపీ తప్పనిసరి

  • కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం, కలెక్టరేట్‌, నవంబరు 6(ఆంధ్ర జ్యోతి): గత రెండు సంవత్సరాల ఐదు నెలల్లో పీజీఆర్‌ ఎస్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా 74,521 అర్జీలు అందా యని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారానికి నూతన విధానం(ఎస్‌వోపీ)పై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీఆర్‌ ఎస్‌లో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో నూతన విధా నం ఎస్‌వోపీ(స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)ని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్‌ సూచించారు.

97.07 శాతం పరిష్కారం..

జిల్లాలో అందిన ఫిర్యాదుల్లో 97.07 శాతం విజయ వంతంగా పరిష్కరించామని కలెక్టర్‌ చెప్పారు. రెవె న్యూ, సర్వే శాఖలకే అత్యధికంగా 47,969 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ శాఖలో 34,211 విన తులు రాగా, 1288 పెండింగ్‌లో ఉన్నాయని, సర్వే శాఖ లో 13,758 అందగా 199 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పంచాయతీరాజ్‌లో 3,046 ఫిర్యాదులు రాగా, 296 పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు.

ఆటోమేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి

పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంలో మానవ జోక్యాన్ని తగ్గించి, పారదర్శకతను పెంపొందించేందుకు ఆటోమేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ చెప్పారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం, పునరావృత ప్రక్రియలు, వ్యక్తిగత విచక్షణకు అవకాశం లేకుండా సాంకేతిన పరిజ్ఞానాన్ని వినియో గించుకోవాలని సూచించారు. ఒకే సమస్యపై ఒకటి కంటే ఎక్కువ అర్జీలు నమోదు కాకుండా డూప్లికేట్‌ దరఖాస్తులను గుర్తించే విధానాన్ని కూడా పటిష్టం చేయాలని తెలిపారు.

వాట్సాప్‌ ఆధారిత

సమాచార వ్యవస్థను అమలు చేయాలి

వాట్సప్‌ ద్వారా అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమా చారం అందించేందుకు వాట్సాప్‌ ఆధారిత సమాచార వ్యవస్థను అమలు చేయాలని కలెక్టర్‌ సూచించారు. అర్హత లేని దరఖాస్తులను తిరష్కరించే ముందు అం దుకు గల కారణాలు స్పష్టంగా నమోదు చేయాల న్నా రు. ఏఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా అధికా రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తిరష్కర ణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని చెప్పారు. అర్జీలు సంఖ్యాపరంగా పరిష్కరించినట్టు చూ పించడం కాకుండా ప్రజలకు వాస్తవమైన ఉపశమనం కలిగించే విధంగా పరిష్కారం అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్‌, ఏఎస్‌పీ సామ్యలత, డీఆర్‌వో సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:50 PM