72-hour no-fly zone 72 గంటలు నో ఫ్లైయింగ్ జోన్
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:17 AM
72-hour no-fly zone భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 1న వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రామసుందరెడ్డి తెలిపారు. విమానాశ్రయం పరిసరాల్లో 72 గంటల పాటు అధికారికంగా నో ప్లైయింగ్ జోన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
72 గంటలు నో ఫ్లైయింగ్ జోన్
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జూలై 30(ఆంధ్రజ్యోతి): భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 1న వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రామసుందరెడ్డి తెలిపారు. విమానాశ్రయం పరిసరాల్లో 72 గంటల పాటు అధికారికంగా నో ప్లైయింగ్ జోన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. విమానాశ్రయం, సభా వేదిక, హెలిపాడ్, పరిసర మార్గాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధి వరకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఈ ఆదేశాలు జూలై 29 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1న రాత్రి8 గంటల వరకూ (మొత్తం 72 గంటలు ) అమల్లో ఉంటాయని వెల్లడించారు. నిషేధ సమయాల్లో విమానాశ్రయ ప్రాంతం చుట్టూ డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఇతర వైమానిక వస్తువులు ఎగరకూడదన్నారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి భద్రతా విఘాతం కలగకుండా, ప్రయాణం సజావుగా సాగేందుకు వీలుగా ప్రజలు, సంబంధిత ఏజెన్సీలు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
------------------------------