70వ సారి రక్తదానం
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:16 AM
నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట సాధన యువజన సంఘం అధ్యక్షుడు పోలుబోతు దుర్గాప్రసాదరావు 70వ సారి రక్తదానం చేసి ప్రశంసలు అందుకున్నా రు.
దుర్గాప్రసాద్‌కు అభినందనల వెల్లువ
నెల్లిమర్ల, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట సాధన యువజన సంఘం అధ్యక్షుడు పోలుబోతు దుర్గాప్రసాదరావు 70వ సారి రక్తదానం చేసి ప్రశంసలు అందుకున్నా రు. విజయనగరంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ పాల్గొని 70వ సారి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారా వు, వైస్ చైర్మన్ పీఆర్‌సీ.రాజు, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, ఇండియన్ రెడ్‌క్రాస్ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ పి.జగన్‌మోహనరావు, విశాఖపట్నం జిల్లా చైర్మన్ బాల సతీష్, విజయనగరం జిల్లా చైర్మన్ కంది వెంకటరమణ, సెక్రటరీ కె.సత్యం, ట్రెజరర్ డాక్టర్ విశ్వేశ్వరరావు, విజయనగరం జిల్లా రెడ్‌క్రాస్ మెడికల్ ఆఫీసర్ డా.భానుప్రకాష్ అవనాపు, జరజాపుపేట గ్రామ పెద్దలు, సాధన యువజన సంఘం ప్రతినిధులు.. దుర్గాప్రసాద్‌ను అభినందించారు.