టీడీపీలోకి 70 వైసీపీ కుటుంబాలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:22 AM
శివడవలస గ్రామానికి చెందిన 70 కుటుంబాలు వైసీపీని వీడాయి.
బొబ్బిలి రూరల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): శివడవలస గ్రామానికి చెందిన 70 కుటుంబాలు వైసీపీని వీడాయి. శుక్రవారం ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో వారు టీడీపీలో చేరారు. ఎంపీటీసీ అభ్యర్థి చప్ప సత్యారావు ఆఽధ్వర్యంలో టీడీపీ నాయకులు చప్ప రామస్వామి, శంబంగి శ్రీను ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. టీడీపీలో చేరిన వారిలో వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ వార్డు సభ్యులు కూడా ఉన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.