టీడీపీలో 65 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:10 AM
వల్లాడ గ్రామానికి చెందిన 65 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి.
గుమ్మలక్ష్మీపురం, జూలై 16 (ఆంధ్ర జ్యోతి): వల్లాడ గ్రామానికి చెందిన 65 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి. స్థానిక క్యాంప్ కార్యాల యంలో నిర్వహించిన కార్య్రకమంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు టీడీపీలో చేరుతున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుండడంతో టీడీపీపై నానాటికీ విశ్వాసం పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అడ్డాకుల నరేష్, మాజీ ఎంపీపీ తాడంగి లక్ష్మణరావు, క్లస్టర్ ఇన్‌చార్జి కిల్లక దాసు, యూనిట్ ఇన్‌చార్జి బిడ్డిక కొండలరావు పాల్గొన్నారు.