600 Seats.. 1,450 Candidates Turn Up సీట్లు 600.. హాజరైంది 1450 మంది
ABN , Publish Date - May 26 , 2026 | 11:45 PM
600 Seats.. 1,450 Candidates Turn Up గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఇంటర్ మొదటి ఏడాదిలో మొత్తంగా 600 సీట్లు ఉండగా.. కౌన్సెలింగ్ మాత్రం సుమారు 1450 మంది హాజరయ్యారు. వారితో పాటు తల్లిదండ్రులు రావడంతో ఐటీడీఏ ప్రాంగణం కిటకిటలాడింది.
భారీగా తరలివచ్చిన విద్యార్థులు
కిటకిటలాడిన ఐటీడీఏ ప్రాంగణం
పార్వతీపురం, మే26(ఆంధ్రజ్యోతి): గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఇంటర్ మొదటి ఏడాదిలో మొత్తంగా 600 సీట్లు ఉండగా.. కౌన్సెలింగ్ మాత్రం సుమారు 1450 మంది హాజరయ్యారు. వారితో పాటు తల్లిదండ్రులు రావడంతో ఐటీడీఏ ప్రాంగణం కిటకిటలాడింది. ఆ ప్రాంతంలో టెంట్లు ఏర్పాటు చేసినా.. ఎండ వేడికి వారు ఇబ్బందులు పడ్డారు. అనంతరం జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి.. గిరిజన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో డీడీ విజయశాంతి, ఏపీవో మురళీధర్, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. కాగా ఏటా జిల్లాలో టెన్త్ ఉత్తీర్ణత శాతం పెరుగుతుండగా.. ఆ స్థాయిలో గిరిజన గురుకుల కళాశాలల్లో సీట్లు పెంచడం లేదు. దీంతో ఎంతోమంది గిరిజన విద్యార్థులు పరిమితంగా ఉన్న సీట్లు పొందలేక ఇంటర్ చదువుకు దూరమవుతున్నారు. పొరుగు జిల్లాలకు వెళ్లి చదువుకునే స్థోమత లేక టెన్త్‌తోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు.