టీడీపీలోకి 60 కుటుంబాలు
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:04 AM
జియ్యమ్మవలస మండలానికి చెందిన తురకనాయుడు వలస గ్రామానికి చెందిన 60 వైసీపీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరారు.
గుమ్మలక్ష్మీపురం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలానికి చెందిన తురకనాయుడు వలస గ్రామానికి చెందిన 60 వైసీపీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో వారందరికీ ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్య క్రమంలో విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, నాయకులు దత్తి లక్ష్మణరావు, దత్తి కామేశ్వరి, డొంకాడ మంగమ్మ తదితరులున్నారు.
ప్రభుత్వ విప్‌ను కలిసిన నూతన ప్రజాప్రతినిధులు..
స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జియ్యమ్మవలస మండ లానికి చెందిన నూతన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరిపి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అందరినీ సత్కరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ విప్‌ను కలిసిన వారిలో 11 మంది ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు ఉన్నారు.