టీడీపీలోకి 60 కుటుంబాలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:54 PM
మండలంలో గ్రహపతి అగ్రహారానికి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
బొండపల్లి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మండలంలో గ్రహపతి అగ్రహారానికి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరంతా ఆదివారం విజయనగరంలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు ఆహ్వానించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగిందన్నారు. టీడీపీ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులై పలువురు టీడీపీలోకి చేరుతున్నా రని అన్నారు. ప్రతిఒక్కరూ సామరస్యంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలో ప్రధమంగా నిలవాలని ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో గంట్యా డ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, టీడీపీ మండల అధ్యక్షుడు రాపాక అచ్చంనా యుడు, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, క్లస్టర్ ఇన్‌చార్జిలు నంబూరి రాజేష్ (బుజ్జీ), డోకుల శ్రీనివాస్, కోరాడ కృష్ణలతోపాటు రాయవరపు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.