55 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:15 AM
ఎల్.కోట మండలం రంగరా యపురం జంక్షన్‌లో శనివారం అక్రమం గా తరలిస్తున్న 55 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం కైం/లక్కవరపుకోట, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యో తి): ఎల్.కోట మండలం రంగరా యపురం జంక్షన్‌లో శనివారం అక్రమం గా తరలిస్తున్న 55 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివ రాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం విజయనగరంలోని తన కార్యాలయంలో వెల్లడించా రు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు ఎస్.కోట రూరల్ సీఐ లెంక అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్‌ఐ సీహెచ్ నవీన్ పడాల్ సిబ్బందితో కలిసి రంగరాయపురం జంక్షన్‌లో వాహనాల తనిఖీ నిర్వహిం చారు. అరకు వైపు నుంచి వస్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని నిలుపుదల చేసి, తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 25 ప్యాకెట్లలో 55 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తిం చారు. ఈ గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. గంజాయితో పాటు వాహనాలను సీజ్ చేశారు. నిందితులు అరకు మండలం మాధగడ పంచా యతీకి చెందిన సోనై రాజబాబు, ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా పాడువ మండ లం హట్టగూడ గ్రామానికి చెందిన సంజయ్ హంతాల్, ఒడిశా రాష్ట్రం మధుబన్ బాలియా గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ మహంతిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి, ఎస్.కోట రూరల్ సీఐ లెంక అప్పలనా యుడు, ఎల్.కోట ఎస్‌ఐ నవీన్ పడాల్, ఎల్.కోట హెడ్ కానిస్టేబుల్ ఎస్.వైకుంఠ రావు, కానిస్టేబుల్ జి.సురేంద్రను ఎస్పీ ఈసందర్భంగా అభినందించారు.