Share News

పింఛన్లు కోరుతూ 55 దరఖాస్తులు

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:19 AM

మండల కేంద్రం ఎల్‌.కోటలో ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటి వద్ద శుక్రవారం నిర్వహించి న ప్రజాదర్బార్‌కు పింఛన్లు కోరుతూ ప్రజల నుంచి 55 దరఖాస్తులు వచ్చాయి.

పింఛన్లు కోరుతూ 55 దరఖాస్తులు

లక్కవరపుకోట, జూన్‌ 12(ఆంధ్రజ్యో తి): మండల కేంద్రం ఎల్‌.కోటలో ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటి వద్ద శుక్రవారం నిర్వహించి న ప్రజాదర్బార్‌కు పింఛన్లు కోరుతూ ప్రజల నుంచి 55 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 62 దరఖాస్తులు రాగా.. అందులో పింఛన్లవే ఎక్కువగా ఉండడం విశేషం. ఇప్పటివరకు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వేలకొలది దరఖాస్తులు పింఛన్ల కోసం రావడంతో వాటి అవసరం ప్రజలకు ఎంతుందో తెలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుందని తెలిపారు.

Updated Date - Jun 13 , 2026 | 12:19 AM