పీజీఆర్‌ఎస్‌కు 53 వినతులు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:54 PM
స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ 53 వినతులను స్వీకరించారు.
సీతంపేట, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ 53 వినతులను స్వీకరించారు. అర్జీల వివరాల్లోకి వెళితే.. తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని పూతికవలస, పాలిష్‌కోట, అక్కరాపల్లి గ్రామాలకు చెందిన ఆరిక తురకన్న, రాజేశ్, సురేష్, ఉష పీవోను కోరారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలయ్యే చూడాలని ఈతమాను గూడ గ్రామానికి చెందిన పత్తిక మాస విన్నవించారు. ఏదైనా ఉద్యోగావకాశం కల్పించాలని మెళియాపుట్టి మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన అంబటి పద్మ.. పీవోకు వినతిపత్రం అందజేసింది. భామిని మండలంలోని జొన్నడుగూడ గ్రామానికి సీసీ రహదారి నిర్మించాలని వూయిక తురకన్న కోరారు. అడ్డంగి గ్రామంలో అంతర్గత సీసీ రహదారి నిర్మించాలని సవర నారాయణ కోరారు.
అధికారులు అందుబాటులో ఉండాలి..
ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు అధికారులు అందరూ తప్పకుండా హాజరుకావాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. గిరిజనుల నుండి వినతులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పీజీఆర్‌ఎస్ కు అందుబాటులో ఉండాలన్నారు అనుమతి లేకుండా గైర్హాజరు అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీవో చిన్నబాబు, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, ఏవో వాహిని, డీఈఈ నాగభూషణం, డీపీఎం రమణ తదితరులున్నారు.