Share News

పింఛన్లకు 51,644 దరఖాస్తులు

ABN , Publish Date - Sep 19 , 2026 | 09:53 PM

జిల్లా వ్యాప్తంగా 51,644 మంది సామాజిక పింఛన్ల కోసం సచివాలయాల్లో దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసుకున్న ట్టు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌పాణి తెలిపారు.

పింఛన్లకు 51,644 దరఖాస్తులు
బొండపల్లి:మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి

- అర్హులను ఎంపిక చేసి మంజూరు చేస్తాం

- డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి

బొండపల్లి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 51,644 మంది సామాజిక పింఛన్ల కోసం సచివాలయాల్లో దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసుకున్న ట్టు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌పాణి తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 21లోగా పరిశీలించి అర్హత గల వారిని ఎంపిక చేస్తామన్నారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెలలోనే పూర్తి చేసి అక్టోబరు 1న కొత్త పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దరఖాస్తులను సచివా లయ వెల్ఫేర్‌ సహాయకులతో పాటు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పరిశీలిస్తారని చెప్పారు. అర్హత ఉన్న వారిని గుర్తిం చి ఆ వివరాలను ఎంపీడీవో లాగిన్‌లోకి పంపిస్తార న్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికి పింఛన్లు మంజూరవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అరసాడ రఘుపతిరావు, డిప్యూటీ ఎంపీడీవో జి.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.

వెదురు సాగును ప్రోత్సహించాలి

విజయనగరం కంటోన్మెంట్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు, రైతులకు స్థిరమైన ఆదాయ మార్గాలను చూపే వెదురు సాగుని అందరూ ప్రోత్సహించాలని జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ పీడీ శ్రీనివాస పాణి పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరిం చుకొని విజయనగరంలోని టీటీడీసీలో మోడల్‌ వెదురు మొక్కను నాటారు. ఆదాయ వనరులలో వెదురు సాగు ఒకటని, దానిని అందరూ ఆదర్శ సేద్యంగా భావించి ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో ఏపీడీ సావిత్రి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 11:17 PM