తోటపల్లిలోకి ఐదు వేల క్యూసెక్కులు
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:04 AM
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగా వళి నదిలో వరద ప్రవహిస్తోంది. రెండురోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి శనివారం ఐదు వేల క్యూసెక్కుల వరద చేరింది.
గరుగుబిల్లి,సెప్టెంబరు12(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగా వళి నదిలో వరద ప్రవహిస్తోంది. రెండురోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి శనివారం ఐదు వేల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే నుంచి దిగువకు 4,200 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి 105 మీటర్లకు గాను 104.22 మీటర్ల మేర నీరుచేరింది. అలాగే 2.534 టీఎంసీలకు గాను 2.039 టీఎంసీల నీటి నిల్వఉంది. సాగునీటి అవసరాలు నిమిత్తం ప్రధాన కాలువల నుంచి 800 క్యూసెక్కుల మేర విడుదలచేస్తున్నారు. మొత్తంగా 1,320 క్యూసె క్కుల మేర మళ్లించారు. భారీవర్షాలు కురిస్తే మరింతగా వరద ఉధృతి పెరిగే అవకాశముందని ప్రాజెక్టు ఏఈలు బి.కిశోర్‌కుమార్, శ్రీనివాసరావు తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతంలో సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని, అధికమైతే దిగువకు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.