టీడీపీలో 50 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:37 AM
జియమ్మవలస మండలంలోని కన్నపుదొరవలసకు చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి.
గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జియమ్మవలస మండలంలోని కన్నపుదొరవలసకు చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. బుధవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి సమక్షంలో వారు టీడీపీలో చేరారు. బంటు సతీష్, బంటు వెంకటనాయుడు, బంటు తవిటినాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కండువాలు వేసి వారికి ఆమె సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బొంగు సురేష్, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు దాసరి రామారావు, సోములు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురం మండలంలోని చాపరాయిబిన్నిడి పంచాయతీ పరిధిలోని మూలిగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పత్తిక శంకుతలతో పాటు సీపీఎం, వైసీపీలకు చెందిన 20 కుటుంబాలు ప్రభుత్వ విప్ సమక్షంలో టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో అడ్డాకుల నరేష్, బిడ్డిక కొండలరావు, ప్రసాద్, హితీష్కుమార్, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.