టీడీపీలో 50 కుటుంబాలు చేరిక
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:10 AM
పురిటిపెంట పంచాయతీ చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
గజపతినగరం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పురిటిపెంట పంచాయతీ చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరంతా ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీదర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి లెంక చిన్నంనాయుడు, పురిటిపెంట క్లస్టర్ ఇన్‌చార్జి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.