Share News

5% Rebate House Tax ఇంటిపన్ను ముందస్తు చెల్లింపుపై ఐదు శాతం రాయితీ

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:37 PM

5% Rebate on Advance Payment of House Tax గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంటిపన్ను చెల్లింపుదా రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే నెలాఖరులోగా ఇంటి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి ఐదు శాతం రాయితీ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

5% Rebate House Tax ఇంటిపన్ను ముందస్తు చెల్లింపుపై  ఐదు శాతం రాయితీ

  • మే నెలాఖరులోపు చెల్లిస్తేనే వర్తింపు

పార్వతీపురం, ఏప్రిల్‌27(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంటిపన్ను చెల్లింపుదా రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే నెలాఖరులోగా ఇంటి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి ఐదు శాతం రాయితీ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ ద్వారా పన్నును చెల్లించాల్సి ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి సువర్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం ఇంటి పన్నుకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పారు. పాత బకాయిలు, ఇతర పన్నులు, ఫీజులు లేదా యూజర్‌ చార్జీల చెల్లింపుపై ఎటువంటి రాయితీ ఉండదన్నారు.

ఏ మేరకు వసూళ్లవుతాయో..

పాలకొండ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 450 పంచాయతీలు ఉన్నాయి. వీటి ద్వారా పన్ను రూపంలో ప్రభుత్వానికి 2026-27కు గాను 6.19 కోట్లు మేర పన్నులు వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఐదు శాతం మేర పన్ను రాయితీ ప్రకటించిన నేపథ్యంలో ఏ మేరకు వసూలవుతుందని వేచి చూడాల్సి ఉంది. వాస్తవానికి 2027, మార్చి నెలాఖరు వరకు పన్నులు చెల్లించేందుకు అవకాశం ఉంది. అయితే పన్నుల వసూళ్లను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా గ్రామ పంచాయతీల్లోనూ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. 2025-26కి గాను జిల్లాలో రూ. కోట్ల మేర పన్నులు వసూలు కావాల్సి ఉండగా రూ.5.4 కోట్లు మేర వసూలయ్యాయి. 87.42 శాతంతో రాష్ట్రంలో జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.

Updated Date - Apr 27 , 2026 | 11:37 PM