Share News

Diarrhoea 45 రోజుల పాటు స్టాప్‌ డయేరియా

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:48 PM

45-Day Stop Diarrhoea Campaign జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు స్టాప్‌ డయేరియా పేరిట అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. బుధవారం స్థానిక ఎన్‌జీవో సమావేశ మందిరంలో స్టాప్‌ డయేరియా పోస్టర్‌ విడుదల చేశారు.

  Diarrhoea   45 రోజుల పాటు  స్టాప్‌ డయేరియా
పోస్టర్‌ విడుదల చేస్తున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు స్టాప్‌ డయేరియా పేరిట అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. బుధవారం స్థానిక ఎన్‌జీవో సమావేశ మందిరంలో స్టాప్‌ డయేరియా పోస్టర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ... ఏఎన్‌ఎంతో పాటు ఆశ వర్కర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ఐదు సంవత్సరాల పిల్లల తల్లులకు డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వివరిస్తారన్నారు. డయేరియా లక్షణాలు కనిపిస్తే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి విజయమోహన్‌, డీఎంవో సూర్యనారాయణ, ప్రోగ్రాం అధికారి కౌశిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:48 PM