Polling Stations పంచాయతీ పోలింగ్ కేంద్రాలు 4,144
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:50 PM
4,144 Panchayat Polling Stations స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 4,144 పోలింగ్ కేంద్రాలున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల అధికారులు తుది జాబితా విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పంచాయతీలోని పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, ముసాయిదా పోలింగ్ కేంద్రాలు ప్రకటన తదితర ప్రక్రియలు పూర్తి చేసి తుది జాబితా తయారు చేశారు. వాటిని పంచాయతీ , మండలపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జిల్లా అఽధికార యంత్రాంగం స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.
స్థానిక ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం
పార్వతీపురం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 4,144 పోలింగ్ కేంద్రాలున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల అధికారులు తుది జాబితా విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పంచాయతీలోని పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, ముసాయిదా పోలింగ్ కేంద్రాలు ప్రకటన తదితర ప్రక్రియలు పూర్తి చేసి తుది జాబితా తయారు చేశారు. వాటిని పంచాయతీ , మండలపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జిల్లా అఽధికార యంత్రాంగం స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా ఓటర్లను గుర్తిస్తున్నారు. ఈనెల7 లోగా ఓటర్ల వర్గీకరణ పూర్తిచేసి తుది జాబితాను వెల్లడించనున్నారు. మొత్తంగా చూస్తే.. జిల్లాలోని 15 మండలాలు, 451 పంచాయతీల్లో 4128 వార్డులు, 6,43,859 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 3,28,889 మంది, పురుషులు 3,14,904 మంది, ఇతరులు 66 మంది ఉన్నారు. జిల్లాలో అత్య ధికంగా పార్వతీపురం మండలంలో 51,406 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువ గుమ్మ లక్ష్మీపురం మండలంలో 35,037 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా మన్యంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.