Share News

4 stations.. 2 zones 4 స్టేషన్లు.. 2 జోన్లు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:37 AM

4 stations.. 2 zones శృంగవరపుకోట నియోజకవర్గంలోని నాలుగు రైల్వే స్టేషన్లలో రెండు సౌత్‌కోస్టు రైల్వేజోన్‌(విశాఖ)లోకి వెళ్లగా మరో రెండు స్టేషన్లు ఈస్టు కోస్టు రైల్వేజోన్‌లో ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్రం గజిట్‌ విడుదల చేసింది. విశాఖ జోన్‌ కార్యకలాపాలు అధికారికంగా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి.

4 stations.. 2 zones 4 స్టేషన్లు.. 2 జోన్లు
కొత్తవలస రైల్వేస్టేషన్‌

4 స్టేషన్లు.. 2 జోన్లు

ఎస్‌.కోట నియోజకవర్గంలోని నాలుగు రైల్వేస్టేషన్లు రెండుజోన్లలోకి మార్పు

సౌత్‌కోస్టు జోన్‌లోకి కొత్తవలస, కంటకాపల్లి స్టేషన్లు

ఈస్ట్‌ కోస్టు జోన్‌లోకి మల్లివీడు, శృంగవరపుకోట స్టేషన్లు

గజిట్‌ విడుదల చేసిన కేంద్రం

నేటి నుంచి విశాఖ జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం

కొత్తవలస, మే 31(ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట నియోజకవర్గంలోని నాలుగు రైల్వే స్టేషన్లలో రెండు సౌత్‌కోస్టు రైల్వేజోన్‌(విశాఖ)లోకి వెళ్లగా మరో రెండు స్టేషన్లు ఈస్టు కోస్టు రైల్వేజోన్‌లో ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్రం గజిట్‌ విడుదల చేసింది. విశాఖ జోన్‌ కార్యకలాపాలు అధికారికంగా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ నాలుగు రైల్వే డివిజన్‌లతో సౌత్‌ కోస్టు రైల్వేజోన్‌ విశాఖ కేంద్రంగా ఏర్పాటుచేయగా సోమవారం నుంచి రైల్వేజోన్‌ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ జోన్‌ ఏర్పాటు చేయకముందు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న కొత్తవలస, కంటకాపల్లి, మల్లివీడు, శృంగవరపుకోట రైల్వేస్టేషన్‌లు వాల్తేరు డివిజన్‌లోనే ఉండేవి. కొత్తవలస - కిరండోల్‌ రైల్వే మార్గంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌లను వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ నుంచి వేరుచేసి రాయగడ డివిజన్‌లోకి మార్పు చేశారు. రాయగడ రైల్వే డివిజన్‌ ఒడిశాలోని భువనేశ్వర్‌ కేంద్రంగా నడుస్తున్న ఈస్టుకోస్టు రైల్వేజోన్‌లోఉంది. కొత్తవలస- కిరండోల్‌ రైల్వేమార్గంలో ఉన్న లక్కవరపుకోట మండలం మల్లివీడు, శృంగవరపుకోట రైల్వే స్టేషన్‌లు రాయగడ డివిజన్‌లోకి వెళ్లిపోయాయి. కొత్తవలస, కంటకాపల్లి రైల్వే స్టేషన్‌లు కొత్తగా విశాఖకేంద్రంగా ఏర్పాటు చేసిన విశాఖ డివిజన్‌లోని సౌత్‌కోస్టు రైల్వే జోన్‌లోకి వచ్చాయి. దీంతో కొత్తవలస, కంటకాపల్లి రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనుల కోసం విశాఖ జోన్‌ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. మల్లివీడు, శృంగవరపుకోట రైల్వే స్టేషన్లలో ఏపని చేయించుకోవాలన్నా ఈస్టుకోస్టు రైల్వేజోన్‌ పరిధిలోని రాయగడకు గాని, భువనేశ్వర్‌కుగాని వెళ్లాల్సిందే.

ఫ శృంగవరపుకోట, మల్లి వీడు రైల్వేస్టేషన్‌లను విశాఖకేంద్రంగా ఉన్న సౌత్‌ కోస్టు రైల్వేజోన్‌లో కలపాలని కోరినా ఇప్పటికే కేంద్రప్రభుత్వం గజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినందున సాధ్యం కాదంటున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:37 AM