4 Rejection 4 తిరస్కరణ
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:07 AM
4 Rejection జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాలకు 258 నామినేషన్లు, 449 ఎంపీటీసీ స్థానాలకు 2577 నామినేషన్లు దాఖలు కాగా శనివారం నాటి పరిశీలనలో నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అందులో మాజీ మంత్రి బొత్స సోదరుని కుమారుడు బొత్స చైతన్య కూడా ఉన్నారు.
4 తిరస్కరణ
జడ్పీటీసీలకు 258 నామినేషన్లు దాఖలు
254కు ఆమోదం
ఎంపీటీసీలకు 11 నామినేషన్ల తిరస్కరణ
విజయనగరం కంటోన్మెంటు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాలకు 258 నామినేషన్లు, 449 ఎంపీటీసీ స్థానాలకు 2577 నామినేషన్లు దాఖలు కాగా శనివారం నాటి పరిశీలనలో నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అందులో మాజీ మంత్రి బొత్స సోదరుని కుమారుడు బొత్స చైతన్య కూడా ఉన్నారు. భోగాపురం జడ్పీటీసీకి నామినేషన్ వేసిన ఎం.అప్పయ్య రామకృష్ణారెడ్డి, నెల్లిమర్ల జడ్పీటీసీ అభ్యర్థి చందక కృష్ణ, రేగిడి అభ్యర్థి జి.రమ్య నామినేషన్లు కూడా తిరస్కరణ కు గురయ్యాయి. ఇక జిల్లాలోని 449 ఎంపీటీసీ స్థానాలకు గాను 2577 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 11 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరంతా ఆదివారం సంబంధిత అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఎంపీటీసీల నామినేషన్లు తిరస్కరిస్తే ఆర్‌డీవో, జడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణకు గురైతే కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చు. వారి అప్పీల్‌పై సోమవారం తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ఉంది. ఆ తర్వాతే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.