Gambling Suspects Arrested 35 మంది పేకాటరాయుళ్లు అరెస్టు
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:22 AM
35 Gambling Suspects Arrested సాలూరు మండలం కరాసువలస సమీపంలో పౌల్ర్టీ ఫారం వద్ద పేకాడుతున్న 35 మందిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.
సాలూరు, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం కరాసువలస సమీపంలో పౌల్ర్టీ ఫారం వద్ద పేకాడుతున్న 35 మందిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ ముందస్తు సమాచారం మేరకు కరాసువలస గ్రామ సమీపంలోని పాడుబడిన పౌల్ర్టీ ఫారం వద్ద ఏర్పాటు చేసిన పేకాట శిబిరంపై రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ రవీంద్రరాజు సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాడుతున్న 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 33 సెల్‌ఫోన్లు, రూ.లక్షా 68వేల నగదు, సుమారు రూ.లక్షా 17 వేలు విలువ చేసే 42 కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో రూ.5 వేల నుంచి రూ.2 వేల విలువ చేసే కాయిన్స్ ఉన్నాయి. మొత్తంగా రూ.2.85 లక్షలను సీజ్ చేశాం.’ అని తెలిపారు. పేకాటతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.