పిడుగుపాటుకు 32 మూగజీవాల మృతి
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:14 AM
మండల పరిధిలోని నందిగాం గ్రామ సమీపం లో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 26 గొర్రెలు, 6 మేకలు మృతిచెం దాయి.
తెర్లాం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని నందిగాం గ్రామ సమీపం లో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 26 గొర్రెలు, 6 మేకలు మృతిచెం దాయి. గ్రామానికి చెందిన కోరాడ చిన్నప్పడుకు చెందిన 17, నీలబోను సూర్యనా రాయణకు చెందిన 8, మొగుడు పైడయ్యకు చెందిన ఏడు మూగజీవాలు మృతి చెందినట్లు మండల పశువైద్యాధికారి నరేంద్రకుమార్ ధ్రువీకరించారు. పంచాయ తీ, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. సుమారు రూ.6లక్షలు నష్టం ఉంటుందని వైద్యాధికారి చెప్పారు. నష్టపరిహారం అందించేం దుకు చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి నరేంద్రకుమార్ హామీ ఇచ్చారు.