టీడీపీలో 300 గిరిజన కుటుంబాల చేరిక
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:06 AM
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి
పాచిపెంట రూరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం మండలంలో వేటగాని వలసలో రూ.3.13 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డోలీమోతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. ఈమేరకు బొర్రమామిడి, మూటకూడు, గొట్టూరు తదితర పంచాయతీల నుంచి 300 గిరిజన కుటుంబాలు వైసీపీ నుంచి సంధ్యారాణి సమక్షంలో టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గూడేపు యుగంధర్, సాలూరు ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ దోనేరు ఆనంద్‌కుమార్, నాయకులు పూసర్ల నరసింగరావు మాతల బలరాం, చల్లా కనకబాబు, కొత్తల పోలి నాయుడు, మాదిరెడ్డి మజ్జరావు పాల్గొన్నారు.