టీడీపీలో 300 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:17 AM
కార్యక ర్తలనే పార్టీలోకి తీసుకోండి. కంత్రీ నాయకులను వద్దని పార్టీ శ్రేణులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
సాలూరు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): కార్యక ర్తలనే పార్టీలోకి తీసుకోండి. కంత్రీ నాయకులను వద్దని పార్టీ శ్రేణులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఆదివారం తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో పాచిపెంట మండలం కేసలి పంచాయతీ పరిధిలోని మడవలస, ఉబిగుడ్డి, షేరుకుగుడ్డి, కుమ్మరివలసతో పాటు పలు గ్రామాలకు చెందిన దాదాపు 300 కుటుంబాలు మంత్రా సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుడేపు యుగంధర్, పార్టీ నాయకులు ఆకుల శ్రీను, భాస్కరరావు, వాసు ఆధ్వర్యంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆమె ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కేసలి పంచాయతీ ప్రజలు పెద్తఎత్తున టీడీపీలో చేరడం గొప్ప విషయమన్నారు. రానున్న స్ధానిక ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైనికుల్లా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, నర్సింగరావు, బాబాతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.