Dog Attack కుక్కల దాడిలో 30 మేక పిల్లలు మృతి
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:32 AM
30 Goat Kids Killed in Dog Attack కన్నపుదొరవలసలో గురువారం అర్ధరాత్రి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గొర్రెల మందపై అవి దాడి చేశాయి. దీంతో 30 మేక పిల్లలు మృతి చెందాయి.
జియ్యమ్మవలస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కన్నపుదొరవలసలో గురువారం అర్ధరాత్రి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గొర్రెల మందపై అవి దాడి చేశాయి. దీంతో 30 మేక పిల్లలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బొబ్బిలి లక్ష్మణరావు ఎప్పటిలానే గురువారం రాత్రి గొర్రెలు, మేకలను ఇంటి పక్కన ఉన్న శాలలో ఉంచాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కుక్కలు శాలలో చొరబడి 30 మేక పిల్లలపై దాడి చేసి హతమర్చాయి. ఈ ఘటనలో మరికొన్ని మేక పిల్లలు గాయాలపాలయ్యాయి. తెల్లవారుజామున ఈ విషయం తెలుసుకున్న గొర్రెల పెంపకందారు లక్ష్మణరావు మండల పశు వైద్యాధికారి ఎన్.మునికుమార్ బాబుకు సమాచారం అందించారు. దీంతో ఆయన ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన మేక పిల్లలకు తగు చికిత్స అందించారు. ఇన్సూరెన్స్ లేనందున తానేమీ చేయలేనని ఆయన తేల్చి చెప్పారు.