Share News

టీడీపీలో 30 కుటుంబాల చేరిక

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:22 AM

మండలంలోని వైసీపీకు చెందిన 30 కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి.

టీడీపీలో 30 కుటుంబాల చేరిక
కండువాలు వేస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వైసీపీకు చెందిన 30 కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి. రావుపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు, గొల్లవానివలస గ్రామానికి ఐదు కుటుంబాలు ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి సమక్షంలో చేరారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు సుందరరావు, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యుడు సందానంద, మాజీ వార్డు సభ్యుడు ఆనంద్‌ తదితరులకు కండువాలు వేసి ఆమె పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వ యంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మరడాన నారాయణస్వామి నాయుడు, అక్కేన మధుసూదన రావు, అంబటి రాంబాబు, రామారావు, సింహాచలం, సత్యనారాయణమాస్టార్‌, ధనుంజయ్‌నాయుడు తదితరులున్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:22 AM