Share News

30 Beds.. But 60 Patients బెడ్లు 30.. రోగులు 60 మంది

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:20 AM

30 Beds.. But 60 Patients భద్రగిరి సీహెచ్‌సీ రోగులతో కిటకిటలాడుతోంది. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరేసి రోగులకు చికిత్స పొందాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఇన్‌ పేషెంట్లు 60 మంది వరకూ ఉన్నారు. వారిలో అత్యధికులు జ్వరాలతో బాధపడుతున్నారు.

30 Beds.. But 60 Patients బెడ్లు 30.. రోగులు 60 మంది
భద్రగిరి సీహెచ్‌సీలో ఒక బెడ్‌పై ఇద్దరు చొప్పున రోగులున్న దృశ్యం

  • ఇదీ భద్రగిరి సీహెచ్‌సీలో పరిస్థితి

  • వినియోగంలోకి రాని నూతన భవనం

గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): భద్రగిరి సీహెచ్‌సీ రోగులతో కిటకిటలాడుతోంది. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరేసి రోగులకు చికిత్స పొందాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఇన్‌ పేషెంట్లు 60 మంది వరకూ ఉన్నారు. వారిలో అత్యధికులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటీవల 50 పడకలతో నూతన భవనం ప్రారంభోత్సవమైనా మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లకు రన్నింగ్‌ వాటర్‌, సదుపాయం లేదు. జనరేటర్‌ కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో అది వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం పాత భవనంలోనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడున్న 30 పడకలు వారికి చాలడం లేదు. రోగుల సంఖ్య పెరగడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరేసి చొప్పున సర్దుకోవాల్సి వస్తోంది. దీనిపై సీహెచ్‌సీ వైద్యుడు రాజేష్‌ను వివరణ కోరగా.. నాలుగైదు రోజుల్లో నూతన భవనం వినియోగంలోకి వస్తుందని, పేషెంట్లను అక్కడికి తరలిస్తామని వెల్లడించారు.

Updated Date - Aug 30 , 2026 | 12:20 AM