Share News

Mosquito Nets జిల్లాకు 28,624 దోమతెరలు

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:40 PM

28,624 Mosquito Nets for the District జిల్లాకు రెండో విడత కింద 28,624 దోమతెరలు వచ్చాయి. వాటిని త్వరలో వసతిగృహ విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో సుమారు 30 వేల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన దోమతెరలు పెద్దవి కావడంతో ఇద్దరు విద్యార్థులకు కలిపి ఒకటి చొప్పున 15,500 దోమతెరలను అందించనున్నారు.

 Mosquito Nets  జిల్లాకు 28,624 దోమతెరలు
జిల్లాకు వచ్చిన దోమ తెరలతో కలెక్టర్‌, ఇతర శాఖల అధికారులు

పార్వతీపురం, ఆగస్టు10(ఆంధ్రజ్యోతి): జిల్లాకు రెండో విడత కింద 28,624 దోమతెరలు వచ్చాయి. వాటిని త్వరలో వసతిగృహ విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో సుమారు 30 వేల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన దోమతెరలు పెద్దవి కావడంతో ఇద్దరు విద్యార్థులకు కలిపి ఒకటి చొప్పున 15,500 దోమతెరలను అందించనున్నారు. మిగిలిన వాటిని మలేరియా ప్రభావిత గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. దోమకాటుకు గురికాకుండా ఉండేందుకు ఇప్పటికే గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలతో పాటు గురుకులాల్లో కిటీకీలకు మెస్‌లు అమర్చారు. జిల్లాలో మొత్తంగా 779 మలేరియా ప్రభావిత గ్రామాలున్నాయి. మొదటి విడతగా 168 గ్రామాల్లో 26,339 వరకు దోమ తెరలను పంపిణీ చేశారు. కాగా జిల్లాకు రానున్న మరో 30 వేల దోమ తెరలను హైరిస్క్‌ మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందించనున్నారు. రెండో విడతలో వచ్చిన దోమతెరలను తొలుత వసతిగృహ విద్యార్థులకు అందించాలని, దీనిపై పర్యవేక్షణ చేపట్టాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. త్వరలోనే ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలకు చెందిన వసతిగృహాల్లోపంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, డీఎంవో సూర్యనారాయణ వెల్లడించారు.

Updated Date - Aug 10 , 2026 | 11:40 PM