New Pensions నూతన పింఛన్లకు 26 వేల దరఖాస్తులు
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:00 AM
26,000 Applications Submitted for New Pensions ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. పలు రకాల పింఛన్లకు జిల్లా నుంచి 26,441 దరఖాస్తులు సచివాలయాలకు వచ్చాయని డీఆర్‌డీఏ పీడీ సీహెచ్ ప్రభావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. పలు రకాల పింఛన్లకు జిల్లా నుంచి 26,441 దరఖాస్తులు సచివాలయాలకు వచ్చాయని డీఆర్‌డీఏ పీడీ సీహెచ్ ప్రభావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలు, అభ్యంతరాలను త్వరితగతిన అందించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నూతన పింఛన్లు మంజూరవుతాయని పేర్కొన్నారు.
ఇదీ పరిస్థితి..
నూతన పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఈ నెల 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 వరకు గడువు విధించింది. అయితే సర్వర్ సమస్య కారణంగా ఈ నెల 18 వరకు గడువు పొడిగించింది. అయితే మొత్తంగా 26,441 అప్లికేషన్లు వచ్చాయి. వీరఘట్టం మండలం నుంచి 1,953, సీతానగరం 1,914, సీతంపేట 1,094, సాలూరు అర్బన్ 717, రూరల్ నుంచి 1,711, పార్వతీపురం పట్టణం 1,141, రూరల్ నుంచి 2,029, పాలకొండ అర్బన్ 539, రూరల్ నుంచి 1,427, పాచిపెంట 1,360, మక్కువ 1,480, కురుపాం 1,365, కొమరాడ 1,777, జియ్యమ్మవలస 1,839, గుమ్మలక్ష్మీపురం 1,405, గరుగుబిల్లి 1,539, భామిని 1,304, బలిజిపేట నుంచి 1,847 దరఖాస్తులు వచ్చాయి. కాగా సచివాలయాల పరిధిలోని సిబ్బంది ఆమోదం తెలపడంలో కొంతమేర జాప్యం నెలకొంది. తొలుత వెల్ఫేర్ అసిస్టెంట్ ఆమోదం తెలిపిన తరువాత ఎంపీడీవోల లాగిన్ నుంచి సంబంధిత శాఖలకు సిఫారసు చేయాల్సి ఉంది. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత నూతన పింఛన్లు మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదికలు అందించాల్సి ఉంది.