టీడీపీలో 235 మంది చేరిక
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:26 AM
సాలూరు మండలం లోని పట్టుచెన్నూరు పంచాయతీ శిఖపరువు గ్రామానికి 135 మంది గిరిజనులు, మక్కువ మేజరు పంచాయతీ పరిధిలోని అంటివలస గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
సాలూరు/ మక్కువ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం లోని పట్టుచెన్నూరు పంచాయతీ శిఖపరువు గ్రామానికి 135 మంది గిరిజనులు, మక్కువ మేజరు పంచాయతీ పరిధిలోని అంటివలస గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆదివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో నిర్వహిం చిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ సమష్టిగా పార్టీ కోసం పనిచేయాలని కోరారు. మక్కువ టీడీపీ నాయకుడు దాసరి కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో మక్కువ మాజీ సర్పంచ్ ఒంటి రామలక్ష్మితో పాటు పలువురు గ్రామస్థులు చేరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు డా.పి.మల్లేశ్వరావు, శివ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.