Share News

టీడీపీలో 230 కుటుంబాల చేరిక

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:26 AM

పాచిపెంట మండలంలోని వివిధ గిరిజన గ్రామాలకు చెందిన 230 కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి.

టీడీపీలో 230 కుటుంబాల చేరిక
పార్టీలో చేరిన వారితో మంత్రి సంధ్యారాణి

సాలూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలంలోని వివిధ గిరిజన గ్రామాలకు చెందిన 230 కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి. సోమవారం పట్టణంలో క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సమక్షంలో పిండ్రంగివలస నుంచి 100 కుటుంబాలు, పులిగుంటవలస నుం చి 30, బడ్నాయకవలస కాలనీకి చెందిన 20, పద్మాపురం నుంచి 40, రోడ్డవలస నుంచి 20, గల్లపాడు నుంచి 10, చంద్రమానువలస నుంచి 10 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆమె ఆహ్వానించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు రూ.500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే.. ఒక్క పాచిపెంటలోనే రూ. 120 కోట్ల మేర వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గిరిజనులకు ట్రైకార్‌ రుణాలు మంజురు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యుగం ధర్‌, ఏఎంసీ చైర్మన్‌ సూర్యనారాయణ, తిరుపతిరావు, సావిత్రమ్మ, కుమారి, ఉమా, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:26 AM