Share News

22ఏ దరఖాస్తులను పరిష్కరించాలి

ABN , Publish Date - May 28 , 2026 | 12:46 AM

భూ సమస్యలకు సంబంధించి 22-ఏకు వచ్చిన దరఖాస్తుల ను, సబ్‌ డివిజన్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్క రించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.

22ఏ దరఖాస్తులను పరిష్కరించాలి

  • కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం, కలెక్టరేట్‌, మే 27(ఆంధ్రజ్యోతి): భూ సమస్యలకు సంబంధించి 22-ఏకు వచ్చిన దరఖాస్తుల ను, సబ్‌ డివిజన్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్క రించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. బుధ వారం ఆయన రెవెన్యూ అధికారులతో ఆర్‌వోఆర్‌ కాన్ఫెరె న్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ 22ఏ దరఖాస్తులపై ఆర్డీవోలు దృష్టి పెట్టాలన్నారు. రీసర్వే ప్రక్రియ వేగంగా జరగాలని, నాణ్యత ముఖ్యమని తెలిపారు. రీ సర్వేపై వారం వారం లక్ష్యాలను ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ క్లినిక్స్‌కు వచ్చిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని ఆయన సూచించారు. రెవెన్యూ సేవలపై సానుకూల ప్రజాభిప్రాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌వోఆర్‌ సర్వేపై ముందు గా నోటీసులు జారీ చేయాలని తెలిపారు. అలాగే రీసర్వేకు కూడా ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. రేషన్‌ పంపిణీలో నాణ్యత ఉండాలని, డిజిటలైజేషన్‌ పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. గృహాల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి అవసరమయ్యే భూమిని గుర్తించాలన్నారు. ఇంటింటా జనగణనలో భాగంగా వలసదారులను కూడా లెక్కింపు చేయాల న్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేతో జనగణన సరిపోవాలని ఆయన సూచించారు. వలసదారులు ఉంటే ఎక్కడెక్కడ ఎంతమంది వలస వెళ్లారో పేర్లతో సహా జాబితా కావాలని, జనగణను తేలికగా తీసుకో కుండా చూడాలని ఆయన సూచించారు.

Updated Date - May 28 , 2026 | 12:46 AM