210 తాగు నీటి బోర్లు మంజూరు
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:09 AM
నియో జకవర్గంలోని ఐదు మండలాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా 210 బోర్లకు రూ.2.73 కోట్లు మంజూరైనట్లు శంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు.
లక్కవరపుకోట, సెప్టెంబర్ 16(ఆంధ్రజ్యోతి): నియో జకవర్గంలోని ఐదు మండలాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా 210 బోర్లకు రూ.2.73 కోట్లు మంజూరైనట్లు శంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు. బుధవారం లక్కవర పుకోటలో విలేకరులతో మాట్లాడుతూ ఎల్.కోట మం డలానికి 86 బోర్లు, కొత్తవలసకు 24, వేపాడకు 33, జామికి 25, ఎస్.కోట మండలానికి 42 బోర్లు మంజూ రు చేశామన్నారు. సమావేశంలో నాయకులు కేబీఏ రాంప్రసాద్, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పి.రత్నాజీ, విశాఖ డెయిరీ డైరెక్టర్ కోళ్ల కాటమయ్య, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, కొట్యాడ ఈశ్వరరావు పాల్గొన్నారు. కాగా ఎల్.కోటలో ఎమ్మెల్యే సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గొంప దుర్గా ఉమేష్, పి.రత్నాజీ, భూపాల్‌నాయుడు, బి.నరసింహమూర్తి, శివాజీ పాల్గొన్నారు.
గ్రంథాలయం నిర్మాణం పూర్తిచేస్తాం
శృంగవరపుకోట, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎస్.కోట శాఖా గ్రంథాలయం భవన నిర్మాణం తొందరగా పూర్తిచేస్తామని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. గ్రంఽథాలయంలో చదువుకొని రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకో ఫైలెట్ ఉద్యోగాలను సాధించిన వేలగ హేమంత్, శ్రీభక్త సాయి శంకర్‌లను సన్మానించారు.