Mobile Phones Recovered 204 మొబైల్‌ఫోన్లు రికవరీ
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:56 PM
204 Mobile Phones Recovered జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 204 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న వారి వివరాలు సేకరించి .. సాంకేతికత సాయంతో ట్రాక్ చేశామన్నారు.
బెలగాం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 204 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న వారి వివరాలు సేకరించి .. సాంకేతికత సాయంతో ట్రాక్ చేశామన్నారు. సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదైన బాధితుల వివరాల ప్రకారం.. ఇప్పటివరకు రూ.70 లక్షల విలువైన 410 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. తాజాగా రూ.28.50 లక్షల విలువైన 204 ఫోన్లను సంబంధిత బాధితులకు అందజేశామని వెల్లడించారు. ఎల్విన్‌పేటలో 7, సాలూరు 5, కురుపాం 4, పాచిపెంట 10, పాలకొండ 43, పార్వతీపురం టౌన్ 57, పార్వతీపురం రూరల్ 6, సీతానగరం 1, వీరఘట్టం 9 జియ్యమ్మవలస 8, చినమేరంగి 16, కొమరాడ 7, గరుగుబిల్లి 7, సాలూరు టౌన్ 6, సాలూరు మండలం 12, సీతంపేటలో ఆరు చొప్పన ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అప్రమత్తతే డిజిటల్ భద్రతకు మొదటి అడుగు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సోషల్ మీడియా అండ్ సైబర్ సెల్ సీఐ షేక్ అబ్దుల్‌మారుఫ్, డీసీఆర్‌ఇ సీఐ రమణ, ఏఆర్ ఆర్‌ఐలు పాల్గొన్నారు.