20 years in jail for cheating a girl బాలికను మోసం చేసినందుకు 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:00 AM
20 years in jail for cheating a girl బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో తీసుకువెళ్లి మోసం చేసిన ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్‌కు 20సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి తీర్పు చెప్పారు.
బాలికను మోసం చేసినందుకు 20 ఏళ్ల జైలు
తీర్పు వెల్లడించిన పోక్సో న్యాయాధికారి
వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్
భోగాపురం, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో తీసుకువెళ్లి మోసం చేసిన ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్‌కు 20సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి తీర్పు చెప్పారు. బాధితురాలికి పరిహారంగా ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేయాలని ఆదేశించారు. కేసు వివరాలను ఎస్పీ ఏఆర్.దామోదర్ బుధవారం తెలిపారు.
భోగాపురం మండలం ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన కుమారై(బాలిక) కనిపించడం లేదని 2024 మే 22న భోగాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ పి.సూర్యకుమారి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను గుర్తించాక ఆమె నుంచి స్టేట్‌మెంటు తీసుకున్నారు. ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డిసురేష్ తనను పెళ్లి చేసుకొంటానని నమ్మించి విశాఖ, హైదరాబాదు తిప్పాడని తెలిపింది. దీంతో పోలీసులు అదే సంవత్సరం జూలై25న పోక్సో కింద కేసు కట్టి లోతుగా విచారించారు. విజయనగరం డీఎస్సీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. నిందితుడు ఆర్.సురేష్‌పై నేరారోపణలు రుజువు కావడంతో 20 సంవత్సరాల శిక్ష, రూ.50వేల జరిమానా, బాధితురాలికి రూ.5లక్షల పరిహారం మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి తీర్పు వెల్లడించారు. గడిచిన ఆరు నెలల్లో 17 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ దామోదర్ చెప్పారు. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.