పీజీఆర్‌ఎస్‌కు 20 వినతులు
ABN , Publish Date - May 12 , 2026 | 12:38 AM
సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఏపీవో జి.చిన్నబాబు 20 వినతులు స్వీకరించారు.
సీతంపేట రూరల్, మే 11 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఏపీవో జి.చిన్నబాబు 20 వినతులు స్వీకరించారు. పవర్ వీడర్ ఇప్పించాలని కారెం బొంబడుగూడ గ్రామానికి చెందిన గౌరీష్ కోరారు. వజ్జాయిగూడలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సవర బాలరాజు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ బోరు మంజూరు చేయాలని సవర సాయిబాబా అర్జీ సమర్పించారు. రాయితీపై ట్రాక్టర్ ఇప్పించాలని జోగారావు కోరారు. ఎగువదారబ గ్రామానికి సీసీ రహదారి మంజూరు చేయాలని సవర రవీంద్రబాబు వినతి పత్రం అందజేశారు. ఏపీవోతో పాటు టీడబ్ల్యూ ఈఈ రమాదేవి, పీఐయూ డీఈ రాధారాణి, ఏవో వాహిని, వెటర్నరీ ఏడీ శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో ఏఈ నీలిమ తదితరులు పాల్గొన్నారు.