ఒకే వ్యాన్‌లో 20 పశువులు
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:19 AM
స్థానిక జాతీయ రహదారిపై సోమవారం అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యాన్‌ను పట్టుకున్నామని పెదమానాపురం ఎస్‌ఐ కళాధర్ తెలిపారు.
అడ్డుకున్న పోలీసులు
దత్తిరాజేరు, జూలై 27(ఆంధ్రజ్యో తి): స్థానిక జాతీయ రహదారిపై సోమవారం అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యాన్‌ను పట్టుకున్నామని పెదమానాపురం ఎస్‌ఐ కళాధర్ తెలిపారు. పార్వతీపురం నుంచి సబ్బవరం దగ్గర పినగాడ ప్రాం తానికి గోవులను తరలిస్తున్నట్టు పక్కా సమాచారం రావడంతో ఎస్‌ఐ, సిబ్బం ది వాహనాల తనిఖీ చేశామన్నారు. వ్యాన్‌లో పశువులు తరలిస్తున్నట్టు గుర్తించి, వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. వ్యాన్‌లో 20 పశువులు ఉన్నట్టు తెలిపారు. వాహన డ్రైవర్ గొనగాల శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నా మన్నారు. ఈ పశువుల యజమాని కొత్తవలస మండలం దెందూరు సంతపాలెం కు చెందిన గొటివాడ నవీన్ అని డ్రైవర్ తెలిపాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బొండపల్లి, జూలై 27(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం మీదుగా పార్వతీ పురం నుంచి అలమండ సంతకు అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాన్లను స్థానిక పోలీసులు పట్టుకుని, స్టేషన్‌కు తరలించారు. మూడు వ్యానుల్లో సుమారు 15 పశువులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు గుర్తించి, పట్టు కున్నారు. నిందితుల వివరాలను త్వరలో తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.