పోస్టల్ బ్యాలెట్లు 176 నమోదు
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:57 PM
ఈనెల 26న జరగనున్న రాజాం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి 176 మంది ఉద్యోగులు పోస్టల్‌బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.
రాజాం రూరల్, నవం బరు 22(ఆంధ్రజ్యోతి): ఈనెల 26న జరగనున్న రాజాం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి 176 మంది ఉద్యోగులు పోస్టల్‌బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉద్యోగుల కోసం నిర్వహించిన పోలింగ్‌లో 176 మంది ఉద్యోగులు తమ ఓట్లును వినియోగించుకున్నారు. రాజాం మున్సిపల్ ఎన్నికలతో పాటు ఈనెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల విధులకు కేటా యించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకున్నారు. మున్సిపా లిటీలో 32 వార్డులకు సంబంధించి పోలింగ్ నిర్వహించగా 1, 7, 20 వార్డుల నుంచి ఒక్కరు కూడా ఓటు వేయలేదు. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్‌కు సంబం ధించి రాజకీయపార్టీలకు చెందిన ఏజెంట్లు సమక్షంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు సీళ్లు వేయించారు.