పీజీఆర్‌ఎస్‌కు 172 వినతులు
ABN , Publish Date - May 12 , 2026 | 12:30 AM
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 172 వినతులు వచ్చాయి.
విజయనగరం కలెక్టరేట్, మే 11(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 172 వినతులు వచ్చాయి. వీటిని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, జేసీ సేతు మాధవన్, డీఆర్వో చందక సత్తిబాబు, డిప్యూటీ కలెక్టర్లు స్వీకరించారు. వచ్చిన వినతు లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికా రులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలో వినతు లు రీఓపెన్ కావడానికి వీలులేదన్నారు. ఒక వేళ అలా జరిగితే సంబంధించిన అధికారి త ప్పకుండా క్షేత్రస్థాయి పర్యటన చేసి, పరిస్థితిని సమీక్షించాలన్నారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ శాఖకు 85, మున్సిపాల్టీకి 9, డీపీవో 17, డీఆర్‌డీఏ 15, ఏపీఈపీడీసీఎల్ 6, వైద్య ఆర్యోగ శాఖకు 2, గృహ నిర్మాణ శాఖకు 1, ఇతర శాఖ ల నుంచి 30 వినతులు వచ్చాయి.
ఉపాధి అక్రమాలపై విచారణ చేయాలి
విజయనగరం, కలెక్టరేట్, మే 11 (ఆంధ్ర జ్యోతి): ఎల్.కోట మండలం చందులూరు గ్రా మంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అక్ర మాలపై విచారణ చేయాలంటూ గ్రామ ఎం పీటీసీ సభ్యులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో తీర్మానం లేకుండా పనులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
జిల్లాలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ ఏబీ వీపీ విద్యార్థి సంఘ నాయకులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యా ప్తం గా 12 లక్షల మంది విద్యార్థులకు రూ. 5,800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు.